
రాజస్థాన్ జల్ జీవన్ మిషన్ స్కామ్లో ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ స్కామ్తో సంబంధమున్న సీనియర్ అధికారి లాకర్ నుంచి 8 కిలోల బంగారాన్ని ED రిక వరీ చేసింది. మరో రిటైర్డ్ అధికారి లాకర్ నుంచి 1.5 కిలోల బంగారాన్ని ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు కేంద్ర ఏజెన్సీ కొంతమంది సీనియర్ మంత్రులు, బ్యూరోక్రాట్‌లను విచారణకు పిలిచే అవకాశం ఉందని ED లోని సీనియర్ వర్గాలు చెబుతున్నారు.
కోట్లాది రూపాయల జల్ జీవన్ మిషన్ కుంభకోణంలో ఇప్పటికే రాజస్థాన్ ప్రభుత్వానికి చెందిన ఇద్దరు అధికారుల ఇళ్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహించింది. రూ. 2.5 కోట్ల నగదు, కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కొన్ని వారాల తర్వాత ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల బ్యాంకు లాకర్లలో కేంద్ర ఏజెన్సీ సోదాలు నిర్వహించింది. మంగళవారం రూ. 5.86 కోట్ల విలువైన 9.5 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ వెల్లడించింది.
జైపూర్‌లోని పిఎన్‌బి బ్రాంచ్ (ఎంఎల్ రోడ్) లాకర్ నుంచి అధికారులకు సంబంధించిన 8 కిలోల బంగారాన్ని ఇడి స్వాధీనం చేసుకుంది. లాకర్ రాజస్థాన్ ప్రభుత్వ సీనియర్ అధికారి పేరు మీద రిజిస్టర్ చేయబడింది. మరో సెర్చ్ ఆపరేషన్‌లో జైపూర్‌లోని శాస్త్రి నగర్‌లో ఉన్న పీఎన్‌బీ బ్రాంచ్‌లో రిటైర్డ్ రాజస్థాన్ సర్వీస్ ఆఫీసర్ లాకర్ నుంచి 1.5 కిలోల బంగారాన్ని ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Also Read :- నకిలీ ఎలక్ట్రికల్ వైర్లు అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్.. .3 లక్షల 70 వేల విలువైన వైర్లు స్వాధీనం
అయితే ఈ కుంభకోణంలో కొందరు సీనియర్ మంత్రులు, బ్యూరోక్రాట్లకు సంబంధాలున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు వారిని కూడా విచారించే అవకాశం ఉందని ఈడీ వర్గాలు చెబుతున్నాయి. ఆ దిశగా చర్యలు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. గణపతి ట్యూబ్‌వెల్ కంపెనీ, శ్రీ శ్యామ్ ట్యూబ్‌వెల్ కంపెనీలు రెండూ నకిలీ ధృవపత్రాలతో కాంట్రాక్టు పొందినట్లు తెలుస్తోంది. ఈ రెండు కంపెనీల వ్యాపారవేత్తలు రాజస్థాన్ రాష్ట్ర మంత్రివర్గంలోని కొంతమంది మంత్రులకు "సన్నిహితంగా" ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇందులో రాష్ట్రమంత్రి మహేష్ జోషి, PHED (భూగర్భ జలం), ఓ సీనియర్ ED అధికారిగా కూడా ఉన్నట్లు సమాచారం..
ఈ కుంభకోణంపై దర్యాప్తు పరిధిని ED విస్తరించడంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజస్థాన్‌లో భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రచార అస్త్రం దొరికినట్లేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.