Gorakhpur NEET Aspirant Murder Case: గోరఖ్ పూర్ నీట్అభ్యర్థి హత్య కేసు.. నిందితుడు పోలీస్ఎన్ కౌంటర్ లో హతం

Gorakhpur NEET Aspirant Murder Case: గోరఖ్ పూర్ నీట్అభ్యర్థి హత్య కేసు.. నిందితుడు పోలీస్ఎన్ కౌంటర్ లో హతం

గోరఖ్‌పూర్ నీట్ అభ్యర్థి హత్య కేసులో ప్రధాన నిందితుడు పోలీసుల చేతిలో హతమయ్యాడు. నిందితుడు మహ్మద్​ జుబైర్​ను రాంపూర్ జిల్లాలో శుక్రవారం(సెప్టెంబర్​27) రాత్రి ఉత్తరప్రదేశ్ పోలీసుల స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టిఎఫ్) కాల్చి చంపింది. మృతుడు జుబైర్​ పై అనేక కేసులున్నాయని పోలీసులు తెలిపారు. అతనిపై లక్ష రూపాయల రివార్డు కూడా ఉంది. యూపీ వ్యాప్తంగా జుబైర్​ ఆవుల అక్రమ రవాణాకు పాల్పడినట్లు తెలుస్తోంది. 

సెప్టెంబర్ 16న పశువుల అక్రమ రవాణాదారులు చేస్తున్న స్మగ్లర్లు నీట్​ విద్యార్థి దీపక్​ గుప్తాను కాల్చి చంపారు. అతను గోరఖ్‌పూర్‌లో నీట్ మెడికల్ ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతున్నాడు. దీపక్ గుప్తా హత్య తర్వాత జుబైర్ పరారీలో ఉన్నాడు.

రిపోర్టుల ప్రకారం.. సెప్టెంబర్​ 16 తెల్లవారు జామున ఓ గ్రామం నుంచి పశువులను దొంగిలిస్తున్న ముఠాను దీపక్​ గుప్తా అ డ్డుకున్నారు. పశువులు తరలిస్తున్న వాహనాలను స్కూటర్​వెంబడించాడు. నిందితుడు దీపక్​ గుప్తాను పట్టుకొని వాహనంలో గంటకు పైగా తిప్పి అనంతరం  నోట్లో కాల్చి చంపారని ఆరోపణలు ఉన్నాయి. 

దీపక్​ గుప్తా మృతితో  గోరఖ్‌పూర్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది..స్థానికులు గోరఖ్‌పూర్- పిప్రైచ్ రహదారిని దిగ్బంధించి నిరసన తెలిపారు. నిరసన హింసాత్మకంగా మారింది. ఉత్తరప్రదేశ్ అదనపు డైరెక్టర్ జనరల్ (ADG) ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) సహా సీనియర్ పోలీసు అధికారులు కేసును సీరియస్​ గా తీసుకున్నారు. 

ALSO READ : విధ్వంసం సృష్టించేవాళ్ల కోసమే బుల్డోజర్లు..

సెప్టెంబర్ 17న ఈ కేసుకు సంబంధించి ఓ నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడిని పట్టుకునే సమయంలో  రహీమ్‌గా గుర్తించబడిన నిందితుడి కాలికి బుల్లెట్ గాయమైంది. తాజాగా పోలీసుల ఎన్​ కౌంటర్లో కీలక నిందితుడు మహ్మద్​ జుబైర్​మృతిచెందాడు.