
తనను చంపుతామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘నన్ను చంపుతామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఇవాళ మధ్యాహ్నం 3.34 గంటలకు బెదిరింపు కాల్ వచ్చింది. పాకిస్తాన్ కు చెందిన ఒక మొబైల్ వాట్సాప్ కాల్ ద్వారా చంపుతామంటున్నారు. తమ స్లీపర్ సెల్స్ యాక్టివ్‌గా ఉన్నాయన్నారు. ప్రతిరోజు ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తూనే ఉన్నాయి’ అని ఎమ్మెల్యే రాజాసింగ్ ట్వీట్ చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, తెలంగాణ డీజీపీ, హైదరాబాద్ సీపీలను రాజాసింగ్ తన ట్వీట్‌కు ట్యాగ్ చేశారు.