 
                                    - ఘజియాబాద్‌లో ఘటన
- ఇంట్లోకి రానివ్వని తల్లి
ఘజియాబాద్: లాక్‌డౌన్ వేళ బయటికి వెళ్లి సరుకులు తెమ్మని పంపిన తల్లికి ఒక కొడుకు పెద్ద షాక్ ఇచ్చాడు. సరుకులతో పాటు అమ్మకు బోనస్‌గా ఇంటి పని, వంట పనిలో సాయం చేసేందుకు కోడలు పిల్లను పట్టుకొచ్చిండు. దీంతో షాక్ తిన్న ఆమె కోడల్ని ఇంట్లోకి రానియకుండా.. పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్‌లో ఇచ్చింది. ఉత్తర్‌ప్రదేశ్ ఘజియాబాద్‌లో జరిగిన ఈ సంఘటన అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఘజియాబాద్‌లోని సహీదాబాద్ ఏరియాకు చెందిన గుడ్డు రెండు నెలల క్రితం హరిద్వార్‌లోని ఆర్యసమాజ్‌లో సవితా అనే అమ్మాయిని పెండ్లి చేసుకున్నాడు. ఆ టైంలో సాక్షులు లేకపోవడంతో వారికి మ్యారేజ్ సర్టిఫికెట్ ఇవ్వలేదు. సర్టిఫికెట్ కోసం అప్లై చేసుకునేలోపు లాక్‌డౌన్ విధించారు. తన పెళ్లి విషయం ఇంట్లో చెప్పని గుడ్డు సవితను ఢిల్లీలోని ఒక ఇంట్లో ఉంచాడు. లాక్‌డౌన్ కారణంగా సవిత ఉంటున్న ఇంటి ఓనర్ ఇల్లు ఖాళీ చేయమని చెప్పడంతో చేసేదేమీ లేక ఆమెను ఇంటికి తీసుకురావాలని అనుకున్నాడు. కాగా.. బుధవారం ఉదయం తన తల్లి సరుకులు తీసుకురావాలని గుడ్డును బయటకు పంపించగా.. గుడ్డు తన భార్యను ఇంటికి తీసుకుని వచ్చాడు. ఈ పెండ్లీని తను అంగీకరించనని చెప్పిన గుడ్డు తల్లీ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఆమెకు నచ్చజెప్పినా వినలేదు. దీంతో సవితా ఉంటున్న ఇంటి ఓనర్‌తో మాట్లాడిన పోలీసులు లాక్‌డౌన్ ముగిసే వరకు జంటను అక్కడే ఉండనివ్వాలని చెప్పడంతో ఇంటి ఓనర్ దానికి అంగీకరించారు.

 
         
                     
                     
                    