23వ రోజకి చేరిన గౌరవెల్లి ప్రాజెక్ట్ భూనిర్వాసితుల ఆందోళన

23వ రోజకి చేరిన గౌరవెల్లి ప్రాజెక్ట్ భూనిర్వాసితుల ఆందోళన

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్ట్ భూనిర్వాసితుల ఆందోళన 23వ రోజకి చేరుకుంది. భోగి సందర్భంగా దీక్ష శిభిరం వద్దే పిండి వంటలు, ముగ్గులు వేసి నిరసన తెలిపారు. ప్రాజెక్టు కోసం భూములు త్యాగం చేసిన తమకు పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇరవై మూడు రోజులు దాటినా ఏ ఒక్క అధికారి, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిహారం అందే వరకు వెనక్కి తగ్గేదేంటున్నారు నిర్వాసితులు.

మరిన్ని వార్తల కోసం..

317 జీవో రద్దు చేయాలంటూ టీచర్ల వినూత్న నిరసనలు