నిమ్స్ విస్తరణకు పరిపాలన అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం

నిమ్స్ విస్తరణకు పరిపాలన అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం

నిమ్స్ విస్తరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిమ్స్ విస్తరణ ప్రాజెక్టుకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిమ్స్ విస్తరణ కోసం రూ.1,571 కోట్లు కేటాయిస్తూ జీవో రిలీజ్ చేసింది. నిమ్స్ ఎక్స్పాన్షన్ ప్రాజెక్టు బాధ్యతను రోడ్లు భవనాల శాఖకు ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు బిడ్లు ఆహ్వానించి వీలైనంత తొందరగా పనులు ప్రారంభించాలని ఆర్ అండ్ బీ డిపార్ట్మెంట్ను ఆదేశించింది. పేషెంట్ల తాకిడి పెరుగుతుండటంతో నిమ్స్ను విస్తరించాలని కొన్నేళ్లుగా ప్రతిపాదనలు వస్తున్నాయి. ఆ ప్రపోజల్స్ను పరిశీలించిన ప్రభుత్వం రూ.1,571 కోట్ల నిధులతో నిమ్స్ విస్తరణకు అనుమతిస్తూ జీవో జారీ చేసింది. 

నిమ్స్ విస్తరణకు ప్రభుత్వం అనుమతులు జారీ చేయడంపై వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు సంతోషం వ్యక్తం చేశారు. ఆరోగ్య తెలంగాణలో భాగంగా మరో ముందడుగు పడిందంటూ ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్యానికి, ఆరోగ్య సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని హరీశ్ రావు అభిప్రాయపడ్డారు.