కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి : షబ్బీర్అలీ

కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి : షబ్బీర్అలీ
  •     ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్​అలీ

కామారెడ్డి, వెలుగు : పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి బాటలు వేయాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ పేర్కొన్నారు.  శుక్రవారం 
భిక్కనూరు మండలంలోని ఆయా గ్రామాల నుంచి  బీజేపీ, బీఆర్ఎస్ నుంచి షబ్బీర్​అలీ సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు.  

పార్టీలో చేరినవారికి ఆయన కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్​ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సీఎం రేవంత్​రెడ్డి  నాయకత్వం, స్థానిక అభివృద్ధికి ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి  కాంగ్రెస్​లో చేరుతున్నారన్నారు. పీసీసీ జనరల్ సెక్రటరీ ఇంద్రకరణ్​రెడ్డి,  మండల ప్రెసిడెంట్ భీమ్​రెడ్డి, నాయకులు  పాల్గొన్నారు.