‘స్థానిక’ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించాలి : షబ్బీర్అలీ

‘స్థానిక’ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించాలి : షబ్బీర్అలీ

కామారెడ్డి​, వెలుగు : రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ పేర్కొన్నారు. గురువారం మాచారెడ్డి మండలానికి చెందిన వారు అధిక సంఖ్యలో వెళ్లి షబ్బీర్​అలీని కలిసి సన్మానించారు. 

అనంతరం షబ్బీర్​అలీ మాట్లాడుతూ మాచారెడ్డి మండలాభివృద్ధికి కృషి చేస్తానన్నారు.   ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయిస్తానని తెలిపారు. కామారెడ్డి నియోజకవర్గ అభివృద్దికి నిరంతరం కృషి చేస్తానన్నారు.