స్కూల్ ఎడ్యుకేషన్​లో.. 42 మంది బెస్ట్ టీచర్స్​

స్కూల్ ఎడ్యుకేషన్​లో..  42 మంది బెస్ట్ టీచర్స్​
  • స్పెషల్  కేటగిరీలో మరో 12 మందికి అవార్డులు
  • టెక్నికల్ ఎడ్యుకేషన్ లో నలుగురికి  పురస్కారాలు
  • ఈ నెల 5న అవార్డుల ప్రదానం
  • ముగ్గురికి నేషనల్​ టీచర్స్​ అవార్డు

హైదరాబాద్, వెలుగు: టీచర్స్ డే సందర్భంగా అందించే రాష్ట్రస్థాయి బెస్ట్ టీచర్స్ అవార్డులను సర్కారు ప్రకటించింది. స్కూల్ ఎడ్యుకేషన్​లో మొత్తం 42 మందిని  అవార్డులకు ఎంపిక చేశారు. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ  జీవో రిలీజ్ చేశారు. వీరితోపాటు మరో 12మందికి స్పెషల్ కేటగిరిలో  బెస్ట్  టీచర్ అవార్డులు అందించనున్నట్టు ప్రకటించారు. మొత్తం 97మందిని అవార్డులకు ప్రతిపాదించగా వీరిలో 42 మందిని బెస్టు టీచర్లుగా ఎంపిక చేసినట్టు వెల్లడించారు. 

 40 మంది సర్కారు స్కూల్ టీచర్లు కాగా, ఇద్దరు టీఎస్ఆర్ఈఐఎస్​కి చెందిన వారు.  బెస్ట్​టీచర్లకు ఎంపికైనవారిలో  గెజిటెడ్ హెడ్మాస్టర్/ ప్రిన్సిపాల్  కేటగిరిలో 10మంది ఉండగా, స్కూల్ అసిస్టెంట్,  పీజీటీ, టీజీటీ, ఇతర కేటగిరిల్లో 11మంది, ఎస్జీటీ కేటగిరిలో 11 మంది, డైట్ లెక్చరర్ ఒకరు ఉన్నారు. వీరితోపాటు మరో 12 మందిని స్పెషల్ కేటగిరిలో ఎంపిక చేశారు. వీరందరికీ ఈ నెల 5న రవీంద్రభారతిలో టీచర్స్ డే సందర్బంగా అవార్డులను అందించనున్నారు. అవార్డు గ్రహీతలకు సత్కారం, సర్టిఫికెట్​తోపాటు రూ.10వేల క్యాష్ అందిస్తారు. 

టెక్నికల్ ఎడ్యుకేషన్లో నలుగురు ఎంపిక

టెక్నికల్ ఎడ్యుకేషన్ పరిధిలో నలుగురిని బెస్ట్ టీచర్లుగా ఎంపిక చేశారు.  అబ్దుల్లాపూర్ మెట్ ఎస్జీఎం  పాలిటెక్నిక్​ కాలేజీ ప్రిన్సిపాల్ సీహెచ్.వెంకటకృష్ణారావు, సిరిసిల్ల పాలిటెక్నిక్ కాలేజీ ఈఈఈ సెక్షన్ హెడ్  పి. శ్రీదేవి, అబ్దుల్లాపూర్ మెట్ ఎస్జీఎం పాలిటెక్నిక్ కాలేజీ కంప్యూటర్ సైన్స్ సీనియర్ లెక్చరర్ బి.వజ్రయ్య, రామాంతపూర్ పాలిటెక్నిక్ కాలేజీ  కెమికల్ ఇంజినీరింగ్ లెక్చరర్ విజయలక్ష్మి ఉన్నారు. 

బెస్ట్ హెడ్మాస్టర్/ ప్రిన్సిపాల్ వీరే:

నీరడి గంగాశంకర్(నిర్మల్ గర్ల్స్  రెసిడెన్షియల్ కాలేజీ ప్రిన్సిపాల్),  ఎన్.భాగ్యరేఖ(సిరిసిల్ల గర్ల్స్ హైస్కూల్ హెడ్మాస్టర్), హేమచంద్రుడు(యేదిర హైస్కూల్ హెచ్ఎం, మహబూబ్ నగర్), ఈ.ప్రభాకర్(శివంపేట హైస్కూల్ హెచ్ఎం, సంగారెడ్డి), పి.గోవర్థన్  రెడ్డి(ఉప్పల్ వాయి హైస్కూల్ హెచ్ఎం, కామారెడ్డి),  సీహెచ్ సుదర్శన్(గురుమూర్తినగర్ హైస్కూల్ హెచ్ఎం, మేడ్చల్), సిద్దపద్మ (మంజులాపూర్ హైస్కూల్ హెచ్ఎం, నిర్మల్), టి.అరుణశ్రీ(తిప్పర్తి గర్ల్స్ హైస్కూల్ హెచ్ఎం, నల్లగొండ), దామెర శ్రీనివాసులు(నూతనకల్ హైస్కూల్ హెచ్ఎం, సూర్యాపేట), అంబటి వెంకట్రాజం(పైడిమడుగు హైస్కూల్ హెచ్ఎం, జగిత్యాల)

ముగ్గురికి నేషనల్ టీచర్స్ అవార్డు

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణకు చెందిన ముగ్గురు టీచర్లు ‘నేషనల్ టీచర్స్ అవార్డు – 2023’కి ఎంపికయ్యారు. ఇందులో ఇద్దరు టీచర్లు కాగా, ఒకరు ఫ్యాకల్టీ మెంబర్​గా ఉన్నారు. శనివారం కేంద్ర విద్యాశాఖ దేశవ్యాప్తంగా 75 మందిని నేషనల్ టీచర్స్ అవార్డులకు ఎంపిక చేస్తూ ప్రకటన రిలీజ్ చేసింది. ఇందులో 50మంది స్కూల్ టీచర్లు, 13మంది హైయ్యర్ ఎడ్యూకేషన్ టీచర్లు, 12మంది స్కిల్ డిపార్ట్ ట్మెంట్ నుంచి ఉన్నారు. 

తెలంగాణ నుంచి మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట్​లోని రెబ్బాన్ పల్లి స్కూల్ టీచర్ అర్చన నూగురి, ఆదిలాబాద్ లోని భీంపూర్ అప్పర్ ప్రైమరీ స్కూల్ టీచర్ రిటిక ఆనంద్ నేషనల్ టీచర్స్ అవార్డుకు ఎంపికయ్యారు. అలాగే స్కిల్ డెవలప్మెంట్ కు చెందిన ఫ్యాకల్టీ మెంబర్ డా. డిబియెందు చౌదరికి ఈ ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. ఈ ముగ్గురు సెప్టెంబర్ 5 న ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులను అందుకోనున్నారు. సిల్వర్ మెడల్, రూ. 50 వేల నగదు, మెరిట్ సర్టిఫికెట్లను బహూకరించనున్నారు.