కాలేజీలు, వర్సిటీల్లో ఖాళీలు 200పాయింట్ రోస్టర్ సిస్టమ్ తో భర్తీ

కాలేజీలు, వర్సిటీల్లో ఖాళీలు 200పాయింట్ రోస్టర్ సిస్టమ్ తో భర్తీ

న్యూ ఢిల్లీ : దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, కాలేజీల్లో రిజర్వేషన్ల ప్రాతిపదికన ఖాళీలను భర్తీ చేసేటప్పుడు.. ‘200 పాయింట్ రోస్టర్ సిస్టమ్’ ని ఫాలో అవుతామని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. విశ్వవిద్యాలయాలు, కళాశాల ఉద్యోగ నియామకాల్లో ఈ పద్ధతి అనుసరిస్తే… ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని తెలిపింది. ప్రస్తుతం అనుసరిస్తున్న 13 పాయింట్ల రోస్టర్ సిస్టమ్ తో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు నష్టం జరుగుతోందని.. పలు రాష్ట్రాలు అభ్యంతరం చెబుతున్నాయి. ఆర్డినెన్స్ తెచ్చైనా రూల్స్ మార్చాలని డిమాండ్ చేస్తున్నాయి. దీంతో.. తమ నిర్ణయాన్ని స్పష్టం చేసింది కేంద్రప్రభుత్వం.