ముంబై: హోమ్ లోన్ సెగ్మెంట్‌లో ప్రభుత్వ బ్యాంకుల వాటా పెరుగుతోంది. హోమ్ లోన్ల మంజూరు (విలువ పరంగా)లో గవర్నమెంట్ బ్యాంకుల వాటా 50శాతానికి చేరుకుంది. ఈ అంశంలో ప్రైవేట్ బ్యాంకులను అధిగమించాయని క్రెడిట్ ఇన్‌ఫర్మేషన్ కంపెనీ క్రిఫ్ హై మార్క్ ఓ రిపోర్ట్‌లో తెలిపింది.
మొత్తంగా ఇండియాలో హోమ్ లోన్లలో దాదాపు 40శాతం రూ.75 లక్షలకు పైగా ఉన్న హై-వాల్యూ బ్రాకెట్‌లో ఉన్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి యాక్టివ్ హోమ్ లోన్లు ఏడాది లెక్కన 3.3శాతం పెరిగి 2.29 కోట్లకు చేరాయి. విలువ పరంగా చూస్తే 11.1శాతం గ్రోత్ కనిపించింది. ఈ ఏడాది సెప్టెంబర్ చివరికి హోమ్ లోన్ మార్కెట్ సైజ్ రూ.42.1 లక్షల కోట్లకు చేరింది.
ఇదే టైమ్‌లో కన్జూమర్ లోన్లు 15.3శాతం పెరిగి రూ.109.6 లక్షల కోట్లు అయ్యాయి. ఇందులో గోల్డ్ లోన్లు వేగంగా పెరిగాయి. ‘‘ సీజనల్ కారణాలతో కన్స్యూమర్ డ్యూరబుల్స్ లోన్లు గత ఏడాది కాలంలో 10.2శాతం పెరిగాయి”అని క్రిఫ్ రిపోర్ట్ వెల్లడించింది. అసెట్ క్వాలిటీ పరంగా, 31–180 రోజుల వరకు బకాయిల్లో ఉన్న కన్జూమర్ లోన్ల శాతం జూన్‌లో 3.1శాతం నుంచి సెప్టెంబర్‌లో 3శాతానికి తగ్గింది. గత సంవత్సరం సెప్టెంబర్‌లో నమోదైన 3.3శాతంతో పోలిస్తే మెరుగుదల కనిపించింది.
