ప్రభుత్వ కాలేజీల్లో ఉపాధి అవకాశాలు.. నాణ్యమైన విద్యను అందిస్తాం

ప్రభుత్వ కాలేజీల్లో ఉపాధి అవకాశాలు.. నాణ్యమైన విద్యను అందిస్తాం

వనపర్తి టౌన్, వెలుగు: ప్రభుత్వ కాలేజీల్లో స్టూడెంట్లకు నాణ్యమైన విద్యతో పాటు ఉపాధి అవకాశాలు లభిస్తాయని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. సోమవారం వనపర్తి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో విద్యా వారోత్సవాల సందర్భంగా కాలేజీ కరపత్రాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలేజీలో కొత్తగా ప్రారంభించిన ఏఈడీపీ కోర్సులతో విద్యార్థినులకు ఉపాధి అవకాశాలు పెరగుతాయని తెలిపారు. ఇంటర్న్ షిప్  సమయంలో ప్రభుత్వం అందించే రూ.7,500 స్టైఫండ్  ఆర్థికంగా ఉపయోగపడుతుందని చెప్పారు.

విద్యార్థినులు ఎక్కువ సంఖ్యలో చేరి ఈ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రిన్సిపాల్  బి. ఈశ్వరయ్య, రామరాజు యాదవ్, దామోదర్ రెడ్డి, విష్ణుమూర్తి, శ్రీనివాసులు, యువరూప లక్ష్మి, గోవర్ధన్, విజయలక్ష్మి పాల్గొన్నారు.