ఏపీలో డీఎస్సీ98 అభ్యర్థులకు ఉద్యోగాలు

ఏపీలో డీఎస్సీ98 అభ్యర్థులకు ఉద్యోగాలు
  • టూలేట్ నిర్ణయం అంటూ విస్మయం
  • 55 నుంచి 60ఏళ్ల వయసుకు చేరిన అభ్యర్థులు 
  • ఉద్యమాలు, నిరసనలు, కోర్టు కేసులతోనే గడచిపోయిన కాలం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1998 DSC క్వాలిఫైడ్ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు ఓకే చెప్పింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఐతే సర్కార్ నిర్ణయంపై అభ్యర్థులు సంతోషించాలో... బాధ పడాలో అర్థంకాని పరిస్థితి. ఎందుకంటే 1998 నాటి అభ్యర్థులంటే ఇప్పటికి వారి వయస్సు దాదాపుగా 55 నుంచి 60 వరకు ఉంది. జాబ్ కోసం ఎన్నో ఏళ్లు ,ఉద్యమాలు,  నిరసనలు , కోర్టు కేసులతో కాలం గడిపారు అభ్యర్థులు. ఇవ్వాల్సిన ఏజ్ లో జాబ్ ఇస్తే... తమ లైఫ్ మరోలా ఉండేదని అంటున్నారు. ఇందుకు  ఈ కేదారేశ్వర్ రావే జీవితమే ఓ ఉదాహరణ. 

శ్రీకాకుశం జిల్లా పాతపట్నం మండలం పెద్దసీదికి చెందిన 55 అల్లక కేదారేశ్వరరావు... 1998 లో డీఎస్సీ క్వాలిఫై అయ్యాడు. అన్నామలైలో బీఈడీ చదివిన కేదారేశ్వరరావు... అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడతాడు. డీఎస్సీ 98లో క్వాలిఫై అయినా ఏవో కారణాలతో అపాయింట్ మెంట్ ఇవ్వలేదు ప్రభుత్వాలు. అయితే 24 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చేందుకు ఓకే చెప్పింది సర్కార్. మరోవైపు ఉద్యోగం లేక ఇన్నేండ్లలో కేదారేశ్వరరావు జీవితం అల్లకల్లోలం అయ్యింది. పెళ్లి కాలేదు, ఎక్కడ ఉండేవాడో, ఏం చేసేవాడో తెలియదు. సైకిల్ పై బట్టలు వేసుకుని అమ్మేందుకు వెళ్తే ఎవ్వరూ కొనేవారు కాదు. దీంతో మతి స్థిమితం లేక గ్రామస్తులు ఇచ్చింది తింటూ కాలం గడుపుతున్నాడు. 

అన్ని సర్టిఫికెట్లు ఉండి.. ఉద్యోగంలో చేరితే ఎన్నాళ్లా ఉద్యోగం? ఫోన్ కూడా వాడటం రాని, ఆధునిక ప్రపంచానికి దూరమై తన మనో ప్రపంచంలో బతుకుతున్న కేదారేశ్వరరావు..థంబ్ లు వేసి మొబైల్ లో అప్ లోడ్ చేసే టీచర్ ఉద్యోగం ఎలా చేయగలడు? త‌న‌కు ఉద్యోగం వ‌చ్చింద‌న్న సంగ‌తి ఊర్లో కుర్రాళ్లు చెబితే...ఆయ‌న స్పందించిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజనులు తమదైన రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.