
తెలంగాణలో గోహత్యాలు జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు యుగ తులసి, గో సేవ ఫౌండేషన్ ఛైర్మెన్ టీడీపీ పాలక మండలి సభ్యుడు కొలిశెట్టి శివ కుమార్. గోహత్యాలు పెరిగిపోవడం కారణంగానే ఇలాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు. లాక్ డౌన్ సందర్భంగా ఇబ్బందులు పడుతున్నఅర్చకులకు, గోసేవకులకు యుగ తులసి, గో సేవ ఫౌండేషన్ అండగా నిలిచింది. హైదరాబాద్ మింట్ కాంపౌండ్ లోని శ్రీ త్రి శక్తి హనుమాన్ దేవస్థానం దగ్గర 100 మంది అర్చక స్వాములకు , గోసేవకులకు నిత్యావసర సరుకులను కొలిశెట్టి శివ కుమార్ పంపిణీ చేశారు. లాక్ డౌన్ తో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారని చెప్పారు. దీంతో నిత్యం దేవుడి సేవలో ఉండే అర్చక స్వాములకు,గోసేవకులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశామన్నారు. కరోనా నియంత్రణ అయ్యేవరకు ప్రతి ఒక్కరు లాక్ డౌన్ సూచనలు పాటించాలన్నారు. మాస్కులు లేకుండా ఎవరు బయటకు రావొద్దను కోరారు.