ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఐ లేఖతో దిగొచ్చిన ప్రభుత్వం

ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఐ లేఖతో దిగొచ్చిన ప్రభుత్వం
  • ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఐ లేఖతో దిగొచ్చిన ప్రభుత్వం

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఐ లెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సర్కారు దిగొచ్చింది. 2 నెలలుగా గరీబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కల్యాణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యోజన కింద ఉచితంగా అదనపు 5 కిలోల బియ్యం పంపిణీ అమలు చేయకుండా ఎత్తేసిన సర్కార్​కు ఎఫ్​సీఐ తన లేఖతో షాక్​ ఇచ్చింది. దీంతో దెబ్బకు దిగొచ్చిన ప్రభుత్వం, ఈ నెల 18 నుంచి 26 వరకు దాకా 5 కిలోల ఫ్రీ బియ్యం పంపిణీ చేయనుంది. జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి డిసెంబర్ దాకా ఇది కొనసాగుతుందని ప్రభుత్వం ప్రకటించింది.  37.46 లక్షల కార్డుల కోసం రూ.436 కోట్ల అదనపు భారాన్ని భరించడానికి సిద్ధమైనట్టు  సర్కారు ప్రకటించింది. దీంతో ఈనెల, గతనెలలో ఇవ్వని ఉచిత రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బియ్యం  నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తర్వాత నెలకు అడ్జెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకుని ఇచ్చేందుకు సర్కారు నిర్ణయించింది. 

2 నెలలు అమలు చేయలే..
కేంద్రం అందించే 2022 ఏప్రిల్ , మే నెలలకు సంబంధించి ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఐ  నుంచి 1.90 లక్షల  టన్నుల బియ్యాన్ని రాష్ట్ర సర్కారు తీసుకుంది. కానీ స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇస్తే తమకు రూ.70 కోట్ల వరకు నష్టం వస్తుందని  పేదలకు పంపిణీ చేయలే.  దీంతో ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఐ సీరియస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయింది. కేంద్ర కోటా కింద రాష్ట్రం నుంచి బియ్యం తీసుకోవడాన్ని నిలిపేస్తున్నామని స్పష్టం చేసింది. 5 కిలోల బియ్యం ఎగ్గొడదామంటే మొదటికే మోసం వచ్చేలా ఉందని గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది.