మంథని నియోజకవర్గంలోని రామగిరి ఖిల్లా అభివృద్ధికి ఫండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

 మంథని నియోజకవర్గంలోని రామగిరి ఖిల్లా అభివృద్ధికి ఫండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలో టూరిజం అభివృద్ధిపై ప్రభుత్వ ఫోకస్ పెట్టింది. మంథని నియోజకవర్గంలోని రామగిరి ఖిల్లా అభివృద్ధికి ఇప్పటికే రూ.5కోట్లు కేటాయించగా.. ఇందులో రోడ్ల నిర్మాణం కోసం రెండు రోజుల కింద రూ.3.86కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈనెల 14  నుంచి బిడ్డింగ్​డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అవకాశం ఇచ్చింది. నేషనల్​రోప్​వే డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్​ప్రోగ్రాం కింద రామగిరి ఖిల్లాపై రోప్​ ఏర్పాటు చేసేలా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రయత్నం చేస్తున్నారు.

 దీంతో ఈ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. దీంతోపాటు పెద్దపల్లి మండలం సబ్యితం గ్రామ సమీపంలో ఉన్న గౌరిగుండాల జలపాతం అభివృద్ధికి ఇటీవల పెద్దపల్లి ఎమ్మెల్యే  విజయరమణారావు చొరవతో ప్రభుత్వం రూ. 6 కోట్లు కేటాయించింది. దీంతోపాటు కాల్వశ్రీరాంపూర్​ మండలం వెన్నంపల్లి, జాఫర్ఖాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేట గ్రామాల మధ్య ఉన్న పాండవలొంకకు పర్యాటకుల తాకిడి పెరిగింది. 

ఈ మధ్యనే ఈ జలపాతాన్ని గుర్తించి జాతరలు నిర్వహిస్తున్నారు. కాగా పాండవలొంకకు పోవడానికి సరైన మార్గం లేకపోవడంతో దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో వాహనాలను నిలిపేసి కాలినడకన వెళ్లాల్సి వస్తోంది. లొంకలోకి దిగేందుకు మెట్లు లేకపోవడంతో పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. మొత్తంగా పెద్దపల్లి జిల్లాలో టూరిజం అభివృద్ధిపై ప్రభుత్వం ఫోకస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టడంపై జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.