ప్రభుత్వ ఉద్యోగులకు మంచి అవకాశం.. కొత్త పెన్షన్ స్కిం.. వీరికి నో ఛాన్స్..

 ప్రభుత్వ ఉద్యోగులకు మంచి అవకాశం.. కొత్త పెన్షన్ స్కిం.. వీరికి నో ఛాన్స్..

మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయితే ప్రభుత్వం మరోసారి ఉద్యోగులకు ఓ మంచి అవకాశాన్ని కల్పించింది. ఇంతకుముందు ఉద్యోగులు పాత పెన్షన్ పథకం (OPS) డిమాండ్ చేసిన తర్వాత ప్రభుత్వం యూనిఫైడ్ పెన్షన్ స్కిం(UPS)ను ప్రారంభించింది. దీనితో పాటు 2004 సంవత్సరంలో ప్రవేశపెట్టిన  జాతీయ పెన్షన్ వ్యవస్థ (NPS) నుండి UPSకి మారడానికి ప్రభుత్వం సమయాన్ని ఇచ్చింది. 

మీరు 30 సెప్టెంబర్ 2025 వరకు : దీని కింద ఇప్పుడు ఉద్యోగులు కోరుకుంటే యూనిఫైడ్ పెన్షన్ పథకం (UPS) నుండి జాతీయ పెన్షన్ వ్యవస్థ (NPS)కి మారవచ్చు. పాత పెన్షన్ పథకం (OPS) ప్రయోజనాలను పొందాలనుకునే ఉద్యోగుల కోసం ఈ మార్పు తీసుకొచ్చింది. 'యూనిఫైడ్  పెన్షన్ పథకం' (UPS)ని కావాలనుకునే కేంద్ర ఉద్యోగులు 30 సెప్టెంబర్ 2025 మార్చుకోవచ్చు. ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ప్రకారం, ఉద్యోగులు పదవీ విరమణకు ఒక సంవత్సరం ముందు లేదా స్వచ్ఛంద పదవీ విరమణ తేదీకి మూడు నెలల ముందు ఈ సౌకర్యాన్ని పొందోచ్చు.

వీరికి  అవకాశం లేదు: ఉద్యోగాల నుండి తొలగించిన లేదా  శిక్షగా బలవంతంగా పదవీ విరమణ  చేసిన లేదా ఏదైనా రకమైన క్రమశిక్షణా చర్యలు అనుభవిస్తున్న ఉద్యోగులకు ఈ సౌకర్యం లేదు. ఇప్పుడు, ప్రభుత్వం ఇచ్చిన అవకాశం ప్రకారం ఏదైనా ఉద్యోగి UPS నుండి NPSకి మారితే అతను NPSకి సంబంధించిన రూల్స్  పాటించాల్సి ఉంటుంది. దీని తర్వాత అతనికి UPS కింద లభించే ప్రయోజనాలు ఉండవు. NPSలోని ఉద్యోగుల కోసం ప్రభుత్వం అదనంగా 4% సహకారం అందిస్తుంది. ఈ డబ్బు వారి NPS అకౌంట్లో జమ చేస్తుంది. అలాగే  లక్షల మంది కేంద్ర ఉద్యోగులు ఈ నిర్ణయం ద్వారా ప్రయోజనం పొందుతారని భావిస్తున్నారు.

UPS అంటే ఏమిటి: UPS అంటే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనేది భారత ప్రభుత్వం 2024లో ప్రారంభించిన పెన్షన్ పథకం. దీనిని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం అమలు చేసారు. జాతీయ పెన్షన్ సిస్టమ్ (NPS) కింద ఉన్న ఉద్యోగులు మాత్రమే దీనిలోకి మారవచ్చు. ఈ పథకంలో ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత వారి చివరి నేల జీతంలో 50% పెన్షన్‌గా పొందుతారు. ఇందులో 60% కుటుంబ పెన్షన్ కూడా ఉంటుంది. UPS కింద ఉద్యోగులకు ఒక ఫిక్స్డ్  పెన్షన్ గ్యారెంటీ లభిస్తుంది.