హైదరాబాద్, వెలుగు: లాభాపేక్ష లేకుండా పేదోడికి అండగా నిలుస్తున్నది ప్రభుత్వ హాస్పిటల్సేనని, అవి సేవకు ప్రతిరూపమని డీఎంఈ డాక్టర్ నరేంద్ర కుమార్ అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని నిలోఫర్ హాస్పిటల్లో జరిగిన సెకండ్ స్టేట్ లెవల్ నర్సింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ కు ఆయన చీఫ్ గెస్ట్ గా హాజరై మాట్లాడారు.
రోగులకు సేవ చేయడంలో నర్సులు రోల్ మోడల్‌గా ఉండాలని, కొత్త టెక్నాలజీని నేర్చుకుంటూ స్కిల్స్ పెంచుకోవాలన్నారు. ‘నట్స్ అండ్ బోల్ట్స్ ఆఫ్ నర్సింగ్’ అనే థీమ్‌తో జరిగిన ఈ ప్రోగ్రామ్ లో 200 మందికిపైగా ప్రభుత్వ, ప్రైవేట్ నర్సింగ్ ఆఫీసర్లు పాల్గొన్నారు.
