సేవకు ప్రతిరూపం ప్రభుత్వ హాస్పిటల్స్ : డీఎంఈ నరేంద్ర కుమార్

సేవకు ప్రతిరూపం ప్రభుత్వ హాస్పిటల్స్ : డీఎంఈ నరేంద్ర కుమార్
  •     నిలోఫర్ నర్సింగ్ కాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌ లో డీఎంఈ నరేంద్ర కుమార్

హైదరాబాద్, వెలుగు: లాభాపేక్ష లేకుండా పేదలను అక్కున చేర్చుకొని వైద్యం అందిస్తున్న ప్రభుత్వ హాస్పిటల్సే సేవకు నిజమైన ప్రతిరూపాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) డాక్టర్ ఎ. నరేంద్ర కుమార్ అన్నారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌  నిలోఫర్ హాస్పిటల్ లోని నాట్కో ఆడిటోరియంలో ‘నట్స్ అండ్ బోల్ట్స్ ఆఫ్ నర్సింగ్’ అనే థీమ్‌‌‌‌‌‌‌‌ తో నిర్వహించిన 2వ రాష్ట్ర స్థాయి నర్సింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్​కు ఆయన చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

నర్సింగ్ వృత్తిలో ఉన్నవారు రోల్ మోడల్‌‌‌‌‌‌‌‌ గా నిలవాలని, మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త టెక్నాలజీని నేర్చుకుంటూ రోగులకు నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. నిలోఫర్ సూపరింటెండెంట్ డాక్టర్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సుకు టీఎన్‌‌‌‌‌‌‌‌ఏఐ ప్రెసిడెంట్ డాక్టర్ రాజేశ్వరి, డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ విద్యులత, యశోద హాస్పిటల్ జీఎం డాక్టర్ జ్యోతి శర్మ, నిలోఫర్ ఆర్ఎంవో డాక్టర్ ఆనంద్ 200 మందికిపైగా నర్సింగ్ ఆఫీసర్లు పాల్గొన్నారు.