పుస్తకాలొచ్చేశాయ్​.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చేరిన 90 శాతం బుక్స్​

పుస్తకాలొచ్చేశాయ్​.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చేరిన 90 శాతం బుక్స్​
  • జిల్లా కేంద్రాల నుంచి  మండలాలు, రెసిడెన్షియల్ స్కూల్స్​కు  పంపిణీ
  • స్కూల్స్​ రీ ఓపెన్​ కాగానే విద్యార్థులకు అందజేత

కామారెడ్డి/నిజామాబాద్, వెలుగు : బడులు ప్రారంభం కాగానే విద్యార్థులకు టెక్స్ట్​, నోట్​ బుక్స్​, యూనిఫామ్స్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు 90 శాతం టెక్స్ట్​  బుక్స్ రాగా,  యూనిఫామ్స్ రెడీ అవుతున్నాయి. నోటుబుక్స్ మాత్రం నేరుగా స్కూళ్లకు పంపిస్తారు.  ఉమ్మడి జిల్లాలోని గవర్నమెంట్ స్కూళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లలో 2,04,559 మంది విద్యార్థులు ఉండగా, 12,48,590 టెక్స్ట్​ బుక్స్ అవసరం. ఇప్పటికే  11,23,731( 90 శాతం) బుక్స్ వచ్చాయి. 7, 8, 9 తరగతులను సంబంధించిన హిందీ, కొన్ని అభ్యసన బుక్స్ రావాల్సి ఉంది. జూన్ 12న స్కూళ్లు ప్రారంభం కానుండగా, జూన్​1 నాటికే బుక్స్​చేరేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.  కామారెడ్డి, నిజామాబాద్​ జిల్లా కేంద్రాల్లోని గోడౌన్స్ నుంచి మండలాలు, రెసిడెన్షియల్ స్కూళ్లకు పుస్తకాల సరఫరా ప్రారంభమైంది. ఇప్పటికే పలు మండలాలకు టెక్స్ట్​ బుక్స్ చేరాయి. 

నిజామాబాద్​ జిల్లా 

జిల్లాలో గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్స్ 693, యూపీఎస్​లు 116, హైస్కూల్స్ 230, కేజీబీవీలు 25,  మాడల్​ స్కూల్స్ 10 ఉండగా, 1,22,264 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి 7,18,590 టెక్స్ట్​బుక్స్ అవసరం కాగా, 6,46,731 బుక్స్ జిల్లా కేంద్రానికి వచ్చాయి.  ఇందులో 2,20,792 టెక్స్ట్ బుక్స్ మండలాలు, రెసిడెన్షియల్ స్కూల్స్​కు పంపించారు. మిగతావి వారంలో పంపనున్నారు. 

కామారెడ్డి జిల్లా

జిల్లాలో గవర్నమెంట్ స్కూల్స్​, రెసిడెన్షియల్, కేజీబీవీ, మాడల్ స్కూల్స్ కలిపి 1,081 ఉండగా,  82,295 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి 5,30,000 టెక్స్ట్​బుక్స్​ అవసరం కాగా, ఇప్పటికే 4,77,000 బుక్స్​ వచ్చాయి. వీటిని మండలాలు, రెసిడెన్షియల్ స్కూల్స్​కు సప్లయ్​ చేస్తున్నారు.  

 స్కూల్​యూనిఫామ్స్​

కామారెడ్డి జిల్లాలో 72,081 మంది స్టూడెంట్స్​కు యూనిఫాం కుట్టిస్తున్నారు. వీరిలో బాయ్స్​34,428 మంది, గర్ల్స్ 37,653 మంది ఉన్నారు. యూనిఫామ్ కుట్టే బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించారు.  విద్యార్థుల సైజ్​ల ప్రకారం స్టిచ్చింగ్​చేయిస్తున్నారు. పాఠశాలలు ప్రారంభం నాటికి దుస్తులను సిద్ధం చేసేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.