ముషీరాబాద్, వెలుగు: ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని ముషీరాబాద్ ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో 18 కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నాయని ప్రిన్సిపాల్ రాధాకృష్ణమూర్తి తెలిపారు. ఐటీఐ చేయాలనుకునే విద్యార్థులకు నేరుగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కోర్సుల్లో నేర్చుకోదల్చుకున్న విద్యార్థులు ఈ నెల 13 వరకు ఒరిజినల్ ఎస్ఎస్సీ మెమో, టీసీ, బోనఫైడ్, ఆధార్ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికెట్లతో కాలేజీలో సంప్రదించాలని సూచించారు. మరిన్ని వివరాలకు 8500467584 నంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.
