
హైదరాబాద్‌లో లక్ష డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం చేస్తున్నామంటూ టీఆర్ఎస్ ప్రభుత్వం అసత్య వ్యాఖ్యలు చేస్తోందని CLP నేత మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ (మంగళవారం) ఆయన
అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. ఇళ్ల జాబితా తప్పుల తడకగా ఉందన్నారు. హైదరాబాద్‌లోని నాంపల్లిలో 1,824 ఇళ్లు కట్టామని ప్రభుత్వం చెప్పిందని, అయితే…ఒక్క ఇల్లు కూడా కట్టలేదని అన్నారు. అంతేకాదు జూబ్లీహిల్స్‌లోని రెండు ప్రాంతాల్లో 226 ఇళ్లు కట్టినట్టు ప్రభుత్వం చెప్పిందని, అందులోనూ ఎన్నో అవకతవకలు ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్‌లో ప్రతి అర్బన్ నియోజకవర్గానికి 10 వేల చొప్పున ఇళ్లు నిర్మిస్తామని 2016లోనే సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని ఆయన చెప్పారు. GHMC పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ఇంకెప్పుడు 2.4లక్షల ఇళ్లు కడుతుందని భట్టి ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఇప్పటికే లక్ష ఇళ్లు కట్టామని తప్పుడు లెక్కలు చూపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.