అంగన్ వాడీ సెంటర్లకు దసరా సెలవులు

అంగన్ వాడీ సెంటర్లకు దసరా సెలవులు
  • 27 నుంచి వచ్చే నెల 4 వరకు సెలవులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

హైదరాబాద్, వెలుగు: బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా అంగన్ వాడీ సెంటర్లకు సెలవులు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 27 నుంచి వచ్చే నెల 4వరకు సెలవులు ప్రకటిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ స్కూళ్ల మాదిరిగానే, అంగన్ వాడీ సెంటర్లు కూడా దసరా, బతుకమ్మ పండగలు జరుపుకునే విధంగా సెలవులు ఇవ్వాలని అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్లు మంత్రి సీతక్కకు విజ్ఞప్తి చేశారు. 

వారి వినతి మేరకు అంగన్ వాడీలకు దసరా సెలవులు మంజూరు చేయాలని అధికారులను మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. దీంతో ఉమెన్ డెవలప్ మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ డైరెక్టర్ శృతి ఓఝా సెలవులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.