
బషీర్బాగ్, వెలుగు: ప్రభుత్వ పెన్షనర్లకు హెల్త్ కార్డులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ మహిళా పెన్షనర్ల ఫోరమ్ చైర్ పర్సన్ ఉమాదేవి కోరారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఈ నెల 6న నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను మంగళవారం ఫోరమ్ నాయకులు ఆహ్వానించారు. ఆమెతోపాటు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క, మహిళ కమిషన్ చైర్ పర్సన్ నెరేళ్ల శారదా, తెలంగాణ సాంస్కృతిక శాఖ సారధి వెన్నెల పాల్గొననున్నట్లు వివరించారు.