త్వరగా భారత్ కు  ఫైజర్ వ్యాక్సిన్ల దిగుమతి

త్వరగా భారత్ కు  ఫైజర్ వ్యాక్సిన్ల దిగుమతి

దేశ జనాభాతో పోల్చితే భారత్ లో అందుబాటులో ఉన్న కరోనా వ్యాక్సిన్ల సంఖ్య చాలా తక్కువ. ప్రస్తుతం కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేస్తుండగా.. డిమాండ్ కు తగ్గట్టుగా వీటి సరఫరా లేకపోవడంతో చాలా ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ అనుకున్నంత వేగంగా జరగడంలేదు.

ఫైజర్ టీకాను వీలైనంత త్వరగా ఇండియాకు దిగుమతి చేసుకుంటామని తెలిపారు నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్. దీనిపై ఫైజర్ ఫార్మా సంస్థ యాజమాన్యంతో కేంద్రం చర్చిస్తోందన్నారు. ఫైజర్ మాత్రమే కాకుండా మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థలతోనూ కేంద్రం సంప్రదింపులు జరుపుతోందన్నారు. వ్యాక్సిన్లను దేశీయంగా ఉత్పత్తి చేసేందుకు కేంద్రం అన్ని విధాలా సహకరిస్తుందని వీకే పాల్ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ల సరఫరా తక్కువగానే ఉందన్నారు. దేశాలకు వ్యాక్సిన్ డోసుల కేటాయింపులపై ఆయా కంపెనీలకు సొంత ప్రాధాన్యతలు ఉంటాయని తెలిపారు వీకే పాల్.