గరీబ్‌రథ్ ​రద్దు?

గరీబ్‌రథ్ ​రద్దు?

పేద, మధ్యతరగతి జనానికి  తక్కువ ధరకే ఏసీ రైలు ప్రయాణాన్ని అందించిన గరీబ్‌ రథ్​ రైళ్లు పట్టాలకు దూరం కానున్నాయి. ఏసీ కోచ్ లలో ప్రయాణించాలంటే ఇకపై పేదలూ ఎక్కువ ధర చెల్లించాల్సి రానుంది. ఇన్నిరోజులూ గరీబ్‌​ రథ్​ట్రెయిన్​లో తక్కువ డబ్బు చెల్లించి ఏసీ బోగీల్లో ప్రయాణించిన పేద ప్రజలకు ఇది చేదువార్తే. ఇకపై వాళ్లు ఏసీ రైలు ప్రయాణం చేయాలంటే జేబుకు చిల్లు పెట్టుకోక తప్పదు. ఎందుకంటే.. గరీబ్‌​రథ్​ట్రెయిన్లను ఆపేయాలని రైల్వే శాఖ యోచిస్తున్నట్లు సమాచారం. వాటి స్థానంలో ఎక్స్​ప్రెస్​ రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.  కొత్తగా గరీబ్‌ రథ్​ ట్రెయిన్​ కోచ్​లను తయారు చేయొద్దని రైల్వే శాఖ ఇప్పటికే నిర్ణయించింది. ఉన్నవాటిని కూడా దశలవారీగా పక్కన పెట్టేసి, వాటి స్థానంలో ఎక్స్​ప్రెస్​ ట్రెయిన్లను నడపాలని యోచిస్తోంది.

ఆర్థిక భారం తగ్గించుకునేందుకే?

గరీబ్‌ రథ్​ రైళ్లను మధ్యతరగతి, అల్పాదాయ వర్గాల ప్రజల కోసం 2006లో అప్పటి రైల్వే శాఖ మంత్రి లాలూ ప్రసాద్​ యాదవ్​ ప్రారంభించారు. పేద కుటుంబాలకూ ఏసీ ట్రెయిన్​ ప్రయాణాన్ని అందుబాటులోకి తేవడమే వీటి ప్రధాన ఉద్దేశం.  అయితే, ఇది మంచి ఆలోచన కాదని, పేద ప్రజలకు చాలా ప్రయోజనకరంగా ఉన్న ఈ రైళ్లను నిలిపివేసే యోచనను విరమించుకోవాలని పలువురు నాయకులు, సామాజిక వేత్తలు, సోషల్​ మీడియాలోనూ అనేక మంది నెటిజన్లు కేంద్రం ఆలోచనపై ఫైర్​ అవుతున్నారు. గరీబ్‌ రథ్​ ట్రెయిన్లు పది, పద్నాలుగేళ్ల కింద తయారు చేసినవి. వీటికి ఇప్పుడు మెయింటెనెన్స్​ ఖర్చు చాలా ఎక్కువ అవుతోందని, ఆ భారం మోయలేకే ఈ రైళ్లను పక్కన పెట్టాలన్నది రైల్వే ఆలోచనగా చెబుతున్నారు.  గరీబ్‌​రథ్ ​ట్రెయిన్​ ప్రయాణికులు భోజనం, దుప్పట్లకు అదనంగా డబ్బు కూడా చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం, ఏసీ ట్రెయిన్స్​ టికెట్​ ధరలతో పోలిస్తే గరీబ్‌​​ రథ్​ ట్రెయిన్స్​టికెట్​ ధరలు చాలా తక్కువ.  ఒక రూట్లో  ఏసీ త్రీటైర్‌‌  టికెట్‌‌ రూ. 1300  ఉంటే.. అదే దూరానికి గరీబ్‌​రథ్​ట్రెయిన్​లో టికెట్​ ధర రూ.900 మాత్రమే ఉంది.