8 ఏండ్లలో అదనంగా 3.14 లక్షల ఉద్యోగాలిచ్చినం : సీఎస్ సోమేశ్​ కుమార్​

8 ఏండ్లలో అదనంగా 3.14 లక్షల ఉద్యోగాలిచ్చినం : సీఎస్ సోమేశ్​ కుమార్​

హైదరాబాద్, వెలుగు: గడిచిన 8ఏండ్లలో పారిశ్రామిక, ఐటీ రంగాల్లో తాము అనుకున్నదానిక కంటే అదనంగా 3.14 లక్షల మందికి ఉపాధి కల్పించినట్లు సీఎస్​ సోమేశ్​ కుమార్​ తెలిపారు. పారిశ్రామిక, ఐటీ రంగాల్లో జీఎస్టీ పెంపు వ్యూహాలను రూపొందించడంపై బుధవారం బీఆర్కే భవన్​లో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. పారిశ్రామిక అనుకూల విధానాలతో రాష్ట్రం రూ.7.57 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తోందని అన్నారు. జీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీపీని మెరుగుపర్చేందుకు, ప్రైవేటు రంగంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు, ఇంకిన్ని ఉద్యోగాలు కల్పించేందుకు వీలుగా చేపట్టాల్సిన చర్యలను సూచించాలని ఆఫీసర్లను ఆయన కోరారు.

అనంతరం ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్​ రంజన్ మాట్లాడారు. టెక్స్ టైల్స్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఐటీఈఎస్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, ఆటోమొబైల్, లైఫ్ సైన్సెస్, ఫుడ్ ప్రాసెసింగ్, ఎంఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంఈ, మైనింగ్ అండ్​ లాజిస్టిక్స్ రంగాల్లో ప్రైవేట్ పెట్టుబడులు, ఉద్యోగాలను సృష్టించడానికి అధిక సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయన్నారు. ఫర్నిచర్, బొమ్మల తయారీ, డిజిటల్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, గ్రీన్ హైడ్రోజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు తదితర రంగాలను ప్రభుత్వం ప్రాధాన్యతా రంగాలుగా దృష్టి సారిస్తోందన్నారు. సమావేశంలో సీఎం ముఖ్యకార్యదర్శి నర్సింగ్ రావు, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు రజత్ కుమార్, అరవింద్ కుమార్, సునీల్ శర్మ, రాణి కుముదిని, అధర్ సిన్హా తదితరులు పాల్గొన్నారు.