న్యూఢిల్లీ: పెట్టుబడులను వెనక్కి తీసుకోవడంలోభాగంగా ఎయిరిండియాలో 100 శాతం వాటాలను అమ్మేస్తామని మోడీ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఇందులో మెజారిటీ వాటాను అమ్మేందుకు 2018లోనూ ప్రయత్నాలు చేసినా, ఏ ఒక్క కంపెనీ కూడా స్పందించలేదు. ఎయిరిండియాను కొనడానికి ఏడాది మార్చి 17లోపు ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈఓఐ) ప్రకటించాలని ప్రభుత్వం సూచించింది.బిడ్డింగ్ లో గెలిచిన వాళ్లు ఎయిరిండియా ఆస్తులను తీసుకోవడంతోపాటు అది చేసిన రూ.23 వేల కోట్ల పైగా అప్పులనూ భరించాల్సి ఉంటుంది. అంతేగాక మూడు శాతం షేర్లను కంపెనీ పర్మనెంట్ ఉద్యోగులకు ఈఎస్‌ఓపీ రూల్స్ ప్రకారం ఇవ్వాలి. ఎంప్లాయిస్ స్టాక్ ఆప్షన్స్ కింద ప్రభుత్వం 98 కోట్లషేర్లను జారీ చేసే అవకాశం ఉంది. ఎయిరిండియాలో వందశాతం వాటాతో పాటు ఏఐఎస్‌ఏటీఎస్‌లో 50 శాతం వాటాను అమ్ముతారు. ఐఏఎస్‌ఏటీఎస్‌ను గ్రౌండ్ హ్యండ్లింగ్గ్ సర్వీసుల కోసం సింగపూర్ ఎయిర్‌లైన్స్ తో కలిసి ఏర్పాటు చేశారు. బిడ్డింగ్ గెలిచిన కంపెనీకే ఎయిరిండియా మేనేజ్ మెంట్ కంట్రోల్ ను కూడా బదిలీ చేస్తారు. కొన్ని ఆస్తుల బదిలీ ఇక నుంచి ఎయిరిండియా ఇంజనీరింగ్ సర్వీసెస్, ఎయిరిండియా ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ సర్వీసెస్, అల్లాయిడ్ సర్వీసెస్, హోటల్ కార్పొ రేషన్ ఆఫ్ ఇండియాలను ఎయిరిండియా అసెట్స్ హోల్డింగ్ లిమిటెడ్ కు బదిలీ చేస్తారు. వాటా అమ్మకం పరిధిలోకి ఈ కంపెనీ రాదు. ఎయిరిండియా గ్రూప్ అప్పులు రూ.23,286 కోట్లు. ఈ రెండు సంస్థలకు 16,077 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో కాంట్రాక్టు ఉద్యోగులూ ఉన్నారు.మరో వైపు ఎయిరిండియాను అమ్మకానికి పెట్టడాన్ని సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్తానని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యం స్వామి హెచ్చరించారు.
మరిన్నివార్తల కోసం క్లిక్ చేయండి

