‘మన్ కీ బాత్’ తో 34 కోట్ల ఆదాయం..రాజ్యసభలో వెల్లడించిన ప్రభుత్వం

‘మన్ కీ బాత్’ తో 34 కోట్ల ఆదాయం..రాజ్యసభలో వెల్లడించిన ప్రభుత్వం

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ 'మన్ కీ బాత్' కార్యక్రమం రూ.34.13 కోట్ల ఆదాయాన్ని సమకూర్చిందని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు వెల్లడించింది. శుక్రవారం సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ ఈ అంశంపై లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 

ఈ కార్యక్రమం మల్టిపుల్​ట్రెడిషనల్, డిజిటల్ ప్లాట్‌‌‌‌ఫారమ్‌‌‌‌ల ద్వారా ప్రేక్షకులకు చేరువవుతోందని ఆయన తెలిపారు. మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఆకాశవాణి.. అదనపు ఖర్చు లేకుండా, ఉన్న అంతర్గత వనరులను ఉపయోగించుకుని నిర్మిస్తున్నదని ఆయన వెల్లడించారు.