ధరణిలో ఆ ఎడిట్ ఆప్షన్ ఎవరి కోసం?.. కేటగిరీని మార్చి ప్రభుత్వ ఖజానాకు వేలకోట్లు గండికొట్టారా.?

ధరణిలో ఆ ఎడిట్  ఆప్షన్ ఎవరి కోసం?..  కేటగిరీని మార్చి ప్రభుత్వ ఖజానాకు వేలకోట్లు గండికొట్టారా.?

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన సొమ్మును టెర్రాసిస్ సంస్థలో ఎవరైనా దారి మళ్లించారా? ధరణి సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని బ్యాక్‌‌‌‌‌‌‌‌ఎండ్ సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్ కోడింగ్‌‌‌‌‌‌‌‌లో కేటగిరీని మార్చడం ద్వారా చేతివాటం ప్రదర్శించారా? అనే కోణంలో ప్రభుత్వం నియమించిన హైలెవెల్ కమిటీ దర్యాప్తు చేస్తున్నది. ధరణి వచ్చినప్పటి నుంచి అసలు ఎంత చలానా జనరేట్ చేశారు? క్షేత్రస్థాయిలో రైతులు ఎంత కట్టారు? ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ రికార్డుల్లో ఎంత చూపించారు? కేటగిరీ, ల్యాండ్​వ్యాల్యూ ఏమైనా మార్చారా? అన్న అంశాలపై లోతుగా విచారణ జరుపుతున్నది. 

ఆ ‘ఎడిట్’ ఆప్షన్ ఎవరి కోసం?

ధరణి పోర్టల్ డిజైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే అనేక లోపాలు ఉన్నాయని, అవి ఉద్దేశపూర్వకంగా వదిలేశారని అధికారులు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా పాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బుక్ చార్జీలు, యూజర్ చార్జీల వంటి చిన్న మొత్తాలకు సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ‘లాక్’ వేసి మార్చడానికి వీల్లేకుండా చేశారు. కానీ, అసలు ఆదాయం వచ్చే మార్కెట్ వాల్యూ, టోటల్ పేమెంట్, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీల విషయంలో మాత్రం ‘ఎడిట్’ ఆప్షన్ అందుబాటులో ఉంచారు.  చలానా జనరేట్ అయ్యాక డబ్బులు కట్టే సమయానికి, ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చూపించే లెక్కకు మధ్య తేడా సృష్టించేందుకే.. ఈ ఎడిట్ ఆప్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దుర్వినియోగం చేశారని అధికారులు భావిస్తున్నారు. ఈ ఎడిట్ వెసులుబాటు ద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి, ప్రైవేటు వ్యక్తులు జేబులు నింపుకున్నారా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇప్పటి వరకు మొత్తం 52 లక్షల భూలావాదేవీలు జరగగా, ఇందులో అత్యధికంగా 40 లక్షల ట్రాన్సాక్షన్స్ ఒక్క ధరణి పోర్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే నమోదయ్యాయి. ఈ లావాదేవీల విలువ దాదాపు రూ.5 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇంత భారీ డేటాబేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగిన ప్రతి ట్రాన్సాక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పరిశీలించడం సవాలే అయినా, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ  వెనక్కి తగ్గడం లేదు. డబ్బులు చెల్లించిన బ్యాంకు రికార్డులు, పోర్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నమోదైన రికార్డులు, చివరగా జనరేట్ అయిన డాక్యుమెంట్లను కూడా సరిచూస్తున్నట్లు తెలుస్తున్నది. 

కోడింగ్ ముసుగులో కన్నం వేశారా?

గత ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలు చేపట్టిన ‘టెర్రాసిస్’ సంస్థ కార్యకలాపాలపై ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. అర్థం కాని సాంకేతికతను అడ్డం పెట్టుకుని, బ్యాక్‌‌‌‌‌‌‌‌ఎండ్‌‌‌‌‌‌‌‌లో డెవలపర్స్ సాయంతో కోడింగ్‌‌‌‌‌‌‌‌లోనే నంబర్స్ ఏమైనా ట్యాంపర్ చేశారా? అనే కోణంలో విచారణ వేగవంతమైంది. సాధారణంగా సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్ ఆటోమేషన్‌‌‌‌‌‌‌‌లో జరగాల్సిన లెక్కలకు, వాస్తవంగా జరిగిన లావాదేవీలకు పొంతన ఉందా? లేదా? అని వెరిఫై చేస్తున్నారు. కేవలం టెక్నికల్ గ్లిచ్ పేరుతో సరిపెట్టకుండా, ఇది ఉద్దేశ పూర్వకంగా చేసిన ‘డిజిటల్ దోపిడీ’నా అనే దిశగా ఎంక్వైరీ సాగుతోంది. రైతుల నుంచి వసూలు చేసిన సొమ్ము ప్రభుత్వ ఖజానాకు చేరకుండా, మధ్యలోనే మాయమైందా? కోడింగ్ దశలోనే సంఖ్యలను తారుమారు చేసి నిధులు దారి మళ్లించారా? అని హైలెవెల్ కమిటీ ఆరా తీస్తోంది.