అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్దం కారణంగా మన దేశంలో కోవిడ్ లాంటి పరిస్థితులు వస్తాయని, లాక్ డౌన్ విధించే అవకాశం ఉందని వస్తున్న వదంతులపై కేంద్రం స్పందించింది. పశ్చిమాసిలో ఉద్రిక్తతలు తీవ్రతరం అవుతున్న క్రమంలో కోవిడ్-19 తరహాలో దేశవ్యాప్త లాక్‌డౌన్ విధిస్తారంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం.. అలాంటి ఆలోచన ఏదీ కేంద్ర ప్రభుత్వం చేయడం లేదని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హరిదీప్ సింగ్ పూరి క్లారిటీ ఇచ్చారు.
భారత్ లో లాక్‌డౌన్ విధిస్తారంటూ వస్తున్న పుకార్లు పూర్తిగా అవాస్తవం. భారత ప్రభుత్వం దగ్గర అలాంటి ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదు. ఇలాంటి సమయంలో మనం ప్రశాంతంగా, బాధ్యతాయుతంగా ,ఐక్యంగా ఉండటం ముఖ్యం అని అని హరిదీప్ సింగ్ తన సోషల్ మీడియా ప్లాట్ ఫాం X లో రాశారు.
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్దం కారణంగా చమురు రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధి మూతపడింది. దీంతో పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడుతుందన్న భయంలో జనం పెట్రోల్ బంకులపై ఎగబడ్డారు. ఎల్ పీజీ సిలిండర్ల సరఫరాలో కూడా కొరత ఏర్పడటంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తారనే పుకార్లు మొదలయ్యాయి. దీంతో దేశంలో ఇంధన సరఫరా, నిల్వలు సురక్షితంగా ఉన్నాయని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ స్పష్టం చేశారు. శక్తి వనరులు ,ఇంధన సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందన్నారు. ఎంతటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా, భారత్ వాటిని అధిగమిస్తుందని పూరీ అన్నారు.
The global situation remains in flux, and we are closely monitoring developments across energy, supply chains, and essential commodities on a real-time basis.
— Hardeep Singh Puri (@HardeepSPuri) March 27, 2026
Under the leadership of Hon’ble PM @narendramodi Ji, all necessary steps are being taken to ensure uninterrupted…
