ప్రభుత్వ పల్లె దవాఖాన వైద్యుల ఆందోళన

ప్రభుత్వ పల్లె దవాఖాన వైద్యుల ఆందోళన

హైదరాబాద్ కోఠిలోని కమీషనర్ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, మిషన్ డైరెక్టర్ ఎన్ హెచ్ యం కార్యాలయం ముందు వైద్యులు ఆందోళన చేపట్టారు. నూతన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 3 నెలలుగా జీతాలు చెల్లించడం లేదంటూ నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1200 మంది డాక్టర్లు పల్లె దావాఖానాల్లో పనిచేస్తున్నారని.. వెంటనే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ఆర్ఎంపీ వ్యవస్థను నిర్ములించేందుకు పల్లె దావాఖానాల్లో డాక్టర్లుగా తమను నియమించారన్నారు. 

గ్రామాలలో అనేక కష్టాలు పడుతూ.. ప్రజలకు నిత్యం వైద్య సేవలు అందిస్తున్నామని.. కేంద్ర ప్రభుత్వం నుంచి 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం ప్రకారంగా తమకు వేతనాలు చెల్లిస్తున్నారని.. కేంద్రం నుంచి నిధులు రావడం లేదనే సాకుతో తమకు జీతాలు చెల్లించకపోవడం దారుణమని మండిపడ్డారు. గత 3 నెలలుగా వేతనాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ALSO READ :- సీఎం రేవంత్ సోదరుడు తిరుపతిరెడ్డికి గుండెపోటు

ఇప్పటికే పలుమార్లు మంత్రులను, ఉన్నతాధికారులను కలిసిన న్యాయం జరగడం లేదని.. తమ ఆవేదనను అర్ధం చేసుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే వేతనాలు చెల్లించాలని కోరారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనను ఉదృతం చేస్తామని హెచ్చరించారు.