కేంద్రం షార్ట్‌లిస్ట్.. ప్రైవేటీకరణ దిశగా నాలుగు బ్యాంకులు!

కేంద్రం షార్ట్‌లిస్ట్.. ప్రైవేటీకరణ దిశగా నాలుగు బ్యాంకులు!

న్యూఢిల్లీ: బ్యాంకుల ప్రైవేటీకరణ దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. తొలుత  నాలుగు మధ్య శ్రేణి బ్యాంకులను ప్రైవేటీకరణ కోసం ప్రభుత్వం షార్ట్ లిస్ట్ చేసిందని సమాచారం. కేంద్రం తన ఆదాయాన్ని పెంచుకోవాలని చూస్తోందని తెలుస్తోంది. వేలాది ఉద్యోగులను కలిగి ఉన్న రాష్ట్ర స్థాయి బ్యాంకులను ప్రైవేటీకరణ చేయడం రిస్క్ అని మోడీ సర్కార్ అనుకుంటోదని సమాచారం. అయితే ముందుగా సెకండ్ టైర్ బ్యాంకులతో దీన్ని అమలు చేయాలని నిర్ణయించిందని తెలుస్తోంది. ఇందులో భాగంగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను త్వరలోనే ప్రైవేట్ బ్యాంకులుగా మారుస్తుందని సమాచారం.