లక్ష్మణ్ గౌడ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి: బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం చైర్మన్ చిరంజీవులు

లక్ష్మణ్ గౌడ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి: బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం చైర్మన్ చిరంజీవులు

హైదరాబాద్, వెలుగు: జనగామ జిల్లా కొన్నె గ్రామంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఉద్యమకారుడు లక్ష్మణ్ గౌడ్ ను ప్రభుత్వం ఆదుకోవాలని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం కన్వీనర్ చిరంజీవులు డిమాండ్ చేశారు. గురువారం లక్ష్మణ్ గౌడ్ కుటుంబ సభ్యులను చిరంజీవులు, బీసీ ఉద్యమకారుడు వట్టే జానయ్య యాదవ్, బీసీ నాయకులు పరామర్శించారు. చిరంజీవులు మాట్లాడుతూ లక్ష్మణ్ గౌడ్ ఆత్మహత్య ప్రభుత్వ వైఫల్యానికి, పాలకుల నిర్లక్ష్యానికి పరాకాష్ట అని మండిపడ్డారు.

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వ్యవహార శైలిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. లేని భూ వివాదాలను సృష్టించి లక్ష్మణ్ గౌడ్‌‌‌‌ను మానసిక ఒత్తిడికి గురిచేసినట్లు కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం విచారణ జరిపించాలని, డిమాండ్ చేశారు. లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం రూ.కోటి ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, మృతుడి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.