ఐటీసీలోని ప్రభుత్వ వాటా అమ్మకానికి లేనట్టే

ఐటీసీలోని ప్రభుత్వ వాటా అమ్మకానికి లేనట్టే

న్యూఢిల్లీ: స్పెసిఫైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టేకింగ్ ఆఫ్ యూనిట్ ట్రస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్​ ఇండియా (సూటి) ద్వారా ఐటీసీలో తమకున్న వాటాను ఇప్పటిలో అమ్మే ఆలోచన లేదని ప్రభుత్వం పేర్కొంది. కిందటేడాది డిసెంబర్ 31 నాటికి ఐటీసీలో ప్రభుత్వానికి 7.82 శాతం వాటా ఉంది. ప్రస్తుతానికి ఇలాంటి ప్లాన్స్ లేవని డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్రెటరీ తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. చివరి సారిగా 2017 లో ఐటీసీ షేర్లను ప్రభుత్వం అమ్మింది. 2 శాతం వాటాను రూ.291.95 దగ్గర సేల్ చేసింది. బ్రిటిష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమెరికన్ టొబాకో తాజాగా ఐటీసీలో 3.5 శాతం వాటాను అమ్మింది. కంపెనీ షేర్లు 4 శాతం పెరిగి రూ.422 దగ్గర ముగిశాయి.