
హైదరాబాద్, వెలుగు: జిల్లాస్థాయిలో గవర్నమెంట్ టీచర్లకు ఈ నెల13 నుంచి ట్రైనింగ్ ప్రారంభం కానున్నది. హైస్కూల్ హెడ్మాస్టర్లు, టీచర్లకు మంగళవారం నుంచి 20 వరకు సబ్జెక్టులవారీగా శిక్షణ ఇస్తారు. ఎస్జీటీలకు మండలస్థాయిలో 20 నుంచి ట్రైనింగ్ ప్రారంభం కానున్నది. అయితే, జులై వరకు రిటైర్డ్ కానున్న టీచర్లకు మినహాయింపు ఇచ్చారు.
2008 స్పెషల్ విద్యా వలంటీర్లు (ఎస్జీటీ) మండలస్థాయిలో ట్రైనింగ్‌కు అటెండ్ కావాలని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఆదేశాలిచ్చారు. హైస్కూళ్లలో ఇన్చార్జి హెచ్ఎంలుగా పనిచేస్తున్న వారంతా స్కూల్ అసిస్టెంట్ కేడర్‌లోని ట్రైనింగ్‌కు అటెండ్ కావాలని సూచించారు. ఈ నెల 31లోగా టీచర్ల ట్రైనింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని డీఈవోలకు సూచించారు.