సింగరేణి కార్మికుల సొంతింటి కల నెరువేరుస్తాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

సింగరేణి కార్మికుల సొంతింటి కల నెరువేరుస్తాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్, వెలుగు: సింగరేణి కార్మికుల సొంతింటి కలను నెరవేరుస్తామని రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో సింగరేణి కార్మికుల కోసం తాజాగా చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని పేర్కొన్నారు. అధికారులతో సమానంగా కార్మికులకు సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. 

సింగరేణి ఉద్యోగుల మారుపేరు విషయానికి సంబంధించి తొందరగా పరిష్కారం చేస్తాం అని తెలిపారు. మెడికల్ ఇన్వాల్యుయేషన్ కు సంబంధించి సమస్యలకు పరిష్కారం చూపిస్తామని స్పష్టం చేశారు. కోల్ ఇండియా నిబంధనల మేరకు సింగరేణిలో ఆఫీసర్లకు సంబంధించి సౌకర్యాలను ఎలా భరిస్తుందో అదేవిధంగా కార్మికులకు కూడా అన్ని సౌకర్యాలు (టాక్స్) కల్పించడం కోసం ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేస్తుందని తెలిపారు.