సన్మాన శాలువాలతో చిన్నారులకు గౌన్లు

సన్మాన శాలువాలతో చిన్నారులకు గౌన్లు
  • వినూత్న కార్యక్రమానికి 
  • ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శ్రీకారం 

వేములవాడ, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తనకు సన్మానంగా వచ్చిన శాలువాలను ‘ఆనర్ టూ హ్యూమనిటీ’ పేరుతో గౌన్లుగా కుట్టించి పిల్లలకు అందజేస్తున్నారు. ఆదివారం వేములవాడ టౌన్ లోని పలు కాలనీల్లో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై చిన్నపిల్లలకు గౌన్లను పంపిణీ చేశారు. 

తాను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి  సత్కరించిన శాలువాలను తన కొడుకు ఆది కార్తీక్ ఆలోచన మేరకు గౌన్లుగా కుట్టించి చిన్న పిల్లలకు పంపిణీ చేస్తున్నటు ఆయన తెలిపారు. తన గౌరవార్థం వచ్చిన శాలువలను సేవాభావంతో గౌన్లుగా మలిచి పంపిణీ చేయడం సంతోషం ఉందన్నారు.