టీకా కొరత.. విదేశీ వ్యాక్సిన్స్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

టీకా కొరత.. విదేశీ వ్యాక్సిన్స్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల వ్యాప్తి రోజురోజుకీ పెరిగిపోతోంది. అదే సమయంలో టీకా నిల్వలు నిండుకున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ ఉత్పత్తి మీద దృష్టి పెట్టిన కేంద్రం.. విదేశీ సంస్థలు తయారు చేసిన టీకాలకు వేగంగా అప్రూవల్ ఇస్తోంది. ఎమర్జెన్సీ ప్రాతిపదికన విదేశాల్లో రూపొందించిన టీకాలకు ఆమోదం తెలిపి వ్యాక్సిన్ నిల్వలను పెంచుకునేందుకు యత్నిస్తోంది. తద్వారా సెకండ్ వేవ్ కరోనా సమయంలో టీకా కొరత లేకుండా చూస్తోంది. ఇందులో భాగంగా రష్యా తయారు చేసిన స్పుత్నిక్ వీ టీకా అత్యవసర వాడకానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా సోమవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వం ఆమోదం పొందేందుకు మరిన్ని వ్యాక్సిన్ లు ఎదురు చూస్తున్నాయి. ఈ లిస్ట్ లో జాన్సన్ అండ్ జాన్సన్ (బయో ఈ), జైడస్ కాడిలా, సీరం ఇన్ స్టిట్యూట్ రూపొందించిన నోవోవ్యాక్స్ తోపాటు భారత్ బయోటెక్ తయారు చేసిన నాసల్ ఉన్నాయి.