రూ. 2,410 కోట్లతో లింక్ రోడ్లు నిర్మించేందుకు సర్కారు నిర్ణయం

రూ. 2,410 కోట్లతో లింక్ రోడ్లు నిర్మించేందుకు సర్కారు నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్, శివారు ప్రాంతాల్లోని మున్సిపాలిటీల్లో  హైదరాబాద్ రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ఆర్డీసీఎల్) ద్వారా రూ.2,410 కోట్లతో 104 లింక్ రోడ్లను ప్రభుత్వం మంజూరు చేసినట్లు అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో భాగంగా గ్రేటర్​లో 95.47 కి.మీ పొడవునా మొత్తం 1,160 కోట్లతో 72 లింక్ రోడ్లు, బండ్లగూడ జాగీర్, ఘట్ కేసర్, కొత్తూరు, దమ్మాయిగూడ, నాగారం, బడంగ్ పేట, శంషాబాద్, ఇబ్రహీంపట్నం, మణికొండ, జవహర్ నగర్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో రూ. 103.45 కి.మీ మేర లింక్ రోడ్లను నిర్మించనున్నట్లు తెలిపారు. 

మెయిన్ కారిడార్లపై ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు లింక్ రోడ్లు ఉపయోగపడుతున్నాయన్నారు. ఇప్పటికే 126.20 కి.మీ పొడవుతో 135 లింక్ రోడ్ల నిర్మాణానికి అనుమతి రాగా..  అందులో రూ.572 కోట్ల 17 లక్షలతో  52.36 కి.మీ మేర పనులను మొదలుపెట్టామన్నారు.  ఇందులో ఇప్పటివరకు 37 చోట్ల పనులు చేపట్టగా 21 చోట్ల పూర్తయ్యాయని, 16 పనులు పురోగతిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.