హైదరాబాద్, వెలుగు: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గవర్నర్ సీపీ రాధాకృష్ణన్.. రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి యోగా దోహదం చేస్తుందని గురువారం ఓ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. ‘యోగా మన కోసం, సమాజం కోసం’ అనేది ఈ సంవత్సరం థీమ్ అని తెలిపారు. ప్రాచీన భారతీయ వారసత్వంలో యోగా అంతర్భాగమన్నారు. మనసు, శరీరాన్ని యోగా బ్యాలెన్స్ చేస్తుందని స్పష్టం చేశారు.
