తెలంగాణ గర్వించేలా త్రిపురకు సేవలందిస్తా : ఇంద్రసేనారెడ్డి

తెలంగాణ గర్వించేలా త్రిపురకు సేవలందిస్తా : ఇంద్రసేనారెడ్డి

కల్వకుర్తి, వెలుగు: తెలంగాణ గర్వించేలా త్రిపుర రాష్ట్రానికి సేవలందిస్తానని ఆ రాష్ట్ర  గవర్నర్ ఇంద్రసేనారెడ్డి అన్నారు. బుధవారం కల్వకుర్తి వచ్చిన ఆయనను బీజేపీ నాయకులు సన్మానించారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ తన సేవలను గుర్తించి  గవర్నర్ గా నియమించినందుకు సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ నుంచి మూడో వ్యక్తిగా గవర్నర్ పదవి చేపట్టానన్నారు.

త్రిపురలో హిందువులు ఎక్కువగా ఉన్నందున   భద్రాచల  రామాలయం, తిరుమల శ్రీ వెంకటేశ్వర దేవాలయం మాదిరిగా త్రిపురలో దేవాలయాలు  నిర్మించేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో రెడ్డి సేవా సమితి నాయకులు బండల రామచంద్రారెడ్డి, శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.