యాదగిరిగుట్టకు రావాలని‌గవర్నర్ కు ఆహ్వానం : ఈవో వెంకటరావు

యాదగిరిగుట్టకు రావాలని‌గవర్నర్ కు ఆహ్వానం :  ఈవో వెంకటరావు
  •     గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ఆహ్వాన పత్రిక అందజేసిన ఈవో వెంకటరావు

యాదగిరిగుట్ట, వెలుగు: ఈ నెల 30న వైకుంఠ ఏకాదశి పర్వదినం, అధ్యయనోత్సవాల ఆరంభం సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి రావాల్సిందిగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను ఆలయ ఈవో వెంకటరావు సోమవారం ఆహ్వానించారు. ఈ మేరకు ఈవో ఆధ్వర్యంలో ఆలయ అర్చక బృందం హైదరాబాద్ లో గవర్నర్ ను కలిసి ఆహ్వానించారు. ‌వైకుంఠ ఏకాదశి రోజున ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు గవర్నర్ కు ఈవో వివరించారు.

 అనంతరం ఆలయ అర్చక బృందం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు వేదాశీర్వచనం చేయగా.. ఈవో వెంకటరావు లడ్డూప్రసాదం, స్వామివారి శేషవస్త్రాలు అందజేసి నారసింహుడి ఫొటోను బహూకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, ఉప ప్రధానార్చకులు మాధవాచార్యులు, అర్చకులు శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.