మన సంస్కృతి ప్రపంచానికి ఆదర్శం : గవర్నర్ జిష్ణుదేవ్‌‌‌‌ వర్మ

మన సంస్కృతి ప్రపంచానికి ఆదర్శం : గవర్నర్ జిష్ణుదేవ్‌‌‌‌ వర్మ
  • కంది ఐఐటీ కల్చర్ ఫెస్ట్‌‌‌‌లో గవర్నర్ జిష్ణుదేవ్‌‌‌‌ వర్మ

సంగారెడ్డి, వెలుగు : మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచానికి ఆదర్శమనిగవర్నర్‌‌‌‌ జిష్ణు దేవ్‌‌‌‌ వర్మ చెప్పారు. సంగారెడ్డి జిల్లా కంది ఐఐటీహెచ్‌‌‌‌లో సోమవారం జరిగిన కల్చరల్‌‌‌‌ ఫెస్ట్‌‌‌‌ను గవర్నర్‌‌‌‌ జిష్ణుదేవ్‌‌‌‌ వర్మ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గురువు దీపం లాంటి వారని.. ప్రపంచంలో ఎక్కడా లేని గురుశిష్యుల బంధం మన దగ్గరే ఉందన్నారు. కుటుంబ పెద్దలు, గురువులను గౌరవించే పద్ధతి మన సంప్రదాయంలోనే ఉందన్నారు. భారతీయ సంస్కృతి అంటే అనేక మతాలు, భాషలు, వర్ణాలు, కులాలు, ప్రాంతాల సమ్మేళనం అని చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్‌‌‌‌ క్రాంతి వల్లూరు, ఐఐటీహెచ్‌‌‌‌ డైరెక్టర్ బీఎస్.మూర్తి, పండిట్‌‌‌‌ హరిప్రసాద్‌‌‌‌ చౌరాసియా,  డాక్టర్‌‌‌‌ రాజ్యం పాల్గొన్నారు.