మైల్స్ ఆఫ్ స్మైల్స్ పుస్తకం ఆవిష్కరణ

మైల్స్ ఆఫ్ స్మైల్స్ పుస్తకం  ఆవిష్కరణ

హైదరాబాద్, వెలుగు: డాక్టర్ ఎం.ఎస్.​గౌడ్​రచించిన ‘మైల్స్ ఆఫ్​స్మైల్స్– మై లైఫ్​ జర్నీ’ పుస్తకాన్ని రాష్ట్ర గవర్నర్​ జిష్ణుదేవ్​వర్మ ఆదివారం రాజ్​ భవన్​లో ఆవిష్కరించారు. డాక్టర్​ఎం.ఎస్.గౌడ్​తెలుగు రాష్ట్రాల గవర్నర్లకు డెంటల్​సర్జన్, ఇండియన్​ప్రోస్టోడోంటిక్ సొసైటీ మాజీ అధ్యక్షుడు. లండన్ లోని ఇంటర్నేషనల్​బయోగ్రాఫికల్ సెంటర్(ఐబీసీ) కేంబ్రిడ్జ్​2013లో ప్రపంచ వ్యాప్తంగా 100 మంది టాప్​డాక్టర్లకు అవార్డులు ఇవ్వగా, భారత్​నుంచి ఎం.ఎస్.గౌడ్​ఒకరు.

 తెలుగు రాష్ట్రాల్లో కాస్మటిక్​ డెంటిస్ట్రీ, డెంటల్​ లేజర్స్, డెంటల్​ ఇంప్లాంట్లను పరిచయం చేసిన మొదటి వ్యక్తి ఈయనే.  ఓరల్​ హెల్త్​, డెంటల్​ ట్రీట్​మెంట్​పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ... డాక్టర్​ఎం. ఎస్​ గౌడ్​ ఐదు వేర్వేరు భాషల్లో 8 పుస్తకాలను ప్రచురించారు. తెలుగులో ఎం.ఎస్.గౌడ్​మొదటి పుస్తకం ‘మీ చిరునవ్వును సరిదిద్దుకోండి’. 1997లో దీనిని ప్రచురించారు. హిందీ, ఉర్దూ, తమిళం, ఇంగ్లీష్​లో పలు రచనలు చేశారు.