దివ్యాంగులు ఏదైనా సాధించగలరు

దివ్యాంగులు  ఏదైనా సాధించగలరు
  • ఇంటర్నేషనల్​ వైట్ ​కేన్​డేలో గవర్నర్ జిష్ణు దేవ్​ వర్మ
  • ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు

పంజాగుట్ట, వెలుగు: దివ్యాంగులకు అతీత శక్తి ఉంటుందని, జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించగలరని గవర్నర్​ జిష్ణుదేవ్​వర్మ పేర్కొన్నారు. మంగళవారం రాజ్​భవన్​లో ‘ఇంటర్నేషనల్​ వైట్​కేన్ ​డే– 2024’ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పలువురు దివ్యాంగులు పాల్గొని స్కిట్లు, సాంస్కృతిక ప్రదర్శనలు చేశారు. దివ్యాంగురాలు స్వప్న తన కళా నైపుణ్యంతో గవర్నర్ ​ఫొటోలను ప్రదర్శించడంతో గవర్నర్ ​జిష్ణుదేవ్ ​వర్మ ఆమెను అభినందించారు.

 రూ.50 వేలు బహుమతి అందజేశారు. దృష్టి లోపం ఉన్న స్టూడెంట్లు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా ప్రత్యేకంగా రూపొందించిన పుస్తకాలను విడుదల చేశారు.  అనంతరం దివ్యాంగులకు విద్య, సాధికారత కోసం కృషి చేసిన 51 మంది విద్యావేత్తలను సత్కరించారు.  కార్యక్రమంలో గవర్నర్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం, ఆదాయపు పన్ను శాఖ కమిషనర్‌ జీవన్‌లాల్‌,  గవర్నర్‌ జాయింట్‌సెక్రటరీ భవానీశంకర్‌, ఖైరతాబాద్​ కార్పొ రేటర్​విజయారెడ్డి, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.