గవర్నర్ శుక్లాకు స్టంట్..పరామర్శించిన సీఎం రేవంత్రెడ్డి

గవర్నర్ శుక్లాకు స్టంట్..పరామర్శించిన  సీఎం రేవంత్రెడ్డి

హైదరాబాద్, వెలుగు: యశోదా హాస్పిటల్​లో చికిత్స తీసుకుంటున్న గవర్నర్​ర్ శివప్రతాప్ శుక్లాను సీఎం రేవంత్ రెడ్డి గురువారం పరామర్శించారు. మంగళవారం హైటెక్ సిటీలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్​లో గుండె సంబంధిత వ్యాధితో గవర్నర్ అడ్మిట్ అయ్యారు. 

డాక్టర్లు టెస్టులు నిర్వహించి స్టంట్ వేశారు. గవర్నర్ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను, గవర్నర్ సతీమణి జానకీ శుక్లాను సీఎం అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మధ్యాహ్నం  గవర్నర్  డిశ్చార్జ్ అయ్యారని రాజ్ భవన్ అధికారులు తెలిపారు. సీఎం వెంట ఎంపీ వేం నరేందర్ రెడ్డి, గవర్నర్ స్పెషల్ సీఎస్ దానకిషోర్ ఉన్నారు.