ప్రీతి ఆరోగ్యం క్రిటికల్‭గా ఉంది: తమిళి సై

ప్రీతి ఆరోగ్యం క్రిటికల్‭గా ఉంది: తమిళి సై

నిమ్స్‭లో చికిత్స పొందుతున్న ప్రీతిని గవర్నర్ తమిళి సై పరామర్శించారు. ఆమె ఆరోగ్యం క్రిటికల్‭గానే ఉందని అన్నారు. వైద్యానికి సహకరించి ప్రీతి త్వరగా కోలుకుని తిరిగి రావాలని గవర్నర్ ఆకాంక్షించారు. ఈ కేసులో చాలా పరిణామాలు జరిగాయని.. ఏం జరిగిందనేది ఇప్పుడే చెప్పలేమన్నారు. స్టూడెంట్స్ అందరూ ధైర్యంగా ఉండాలని చెప్పారు. ఈ కేసులో విచారణ పూర్తి స్థాయిలో జరగాలని గవర్నర్ తమిళి సై పోలీసులను కోరారు. ప్రతీ చాలా క్లెవర్ స్టూడెంట్ అని విన్నాను... తాను ఆత్మహత్యాయత్నం చేయడం బాధాకమని చెప్పారు. అనంతరం ఆమె కుటుంబసభ్యులను పరామర్శించారు. మరోవైపు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సైఫ్ పోలీసుల అదుపులో ఉన్నాడు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ప్రీతి ఆత్మహత్యాయత్నానికి ముందు ఏం జరిగిందన్న దానిపై సైఫ్ ను విచారిస్తున్నారు. 

మరోవైపు.. ప్రీతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సైఫ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతడిని అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. మొదటి నుంచి కూడా ప్రీతి తండ్రి సైఫ్ పైనే ఆరోపణలు చేస్తున్నారు. తమ కూతురు ఆత్మహత్యయత్నానికి సైఫే కారణమని చెబుతున్నారు.