ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్ : గవర్నర్ ఆమోదం

ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్ : గవర్నర్ ఆమోదం

గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకానికి గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం సిఫార్సులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్ ఎమ్మెల్సీలుగా ఎంపికయ్యారు. 

కోదండరాం ప్రొఫెసర్ గా, తెలంగాణ ఉద్యమ నేతగా ఎంతో గుర్తింపు పొందారు. ఉద్యమ సమయంలో జేఏసీ నేతగా అన్ని ప్రజా, రాజకీయ పార్టీలు, సంఘాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి.. ఉద్యమాన్ని నడించిన చరిత్ర ఉంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ జన సమితి పేరుతో పార్టీ ఏర్పాటు చేసి.. కేసీఆర్ ప్రభుత్వ విధానాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాటం చేశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. కోదండరాంను గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ ఎంపికకు సిఫార్సు చేసింది సీఎం రేవంత్ రెడ్డి సర్కార్. గవర్నర్ తమిళి సై ఆమోద ముద్ర వేశారు.

మరో ఎమ్మెల్సీగా  అమీర్ అలీఖాన్ ఎంపికయ్యారు. ఈయన ప్రముఖ ఉర్ధూ పత్రిక సియాసత్ న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి ఆయన పోరాటం చేస్తున్నారు.