ముర్ము రాష్ట్రపతి కావడం మహిళలకు దక్కిన గౌరవం

ముర్ము రాష్ట్రపతి కావడం మహిళలకు దక్కిన గౌరవం
  • రాజకీయాలు మాట్లాడన్న గవర్నర్ తమిళిసై 
  • ద్రౌపది ముర్ము చాలా కింది స్థాయి నుంచి వచ్చిన మహిళ
  • గవర్నర్ తమిళిసై సౌందరరాజన్

న్యూఢిల్లీ:

కేసీఆర్ ముందస్తు ఎన్నిక‌ల‌కు వెళ్లే అవ‌కాశం లేదని గవర్నర్ తమిళి సై అన్నారు. మారిన రాజకీయ పరిణామాలే అందుకు కారణం కావచ్చని చెప్పారు. ప్రధాని మోడీని టార్గెట్ చేయటం వల్ల కేసీఆర్ లబ్దిపొందుతారని తాను అనుకోవటం లేదని తెలిపారు. జాతీయ రాజకీయాల కోసమే కేసీఆర్ ప్రధానిని టార్గెట్ చేసి ఉండొచ్చన్నారు. రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారానికి వెళ్లిన గవర్నర్... మీడియాతో చిట్ చాట్ చేశారు. రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య గ్యాప్.. ఓపెన్ సీక్రెట్ అని చెప్పారు. ఇటీవల రాజ్ భవన్ లో కేసీఆర్ తనను కలిశారని,  ఆ తర్వాత కూడా ప్రోటోకాల్ ఇవ్వడం లేదని తెలిపారు. వరదల సమయంలో కలెక్టర్ రావాల్సి ఉన్నా రాలేదన్నారు. గవర్నర్ అయినంత మాత్రాన రాజ్ భవన్ కే పరిమితం కానని చెప్పారు. ప్రజలకు దగ్గరగా ఉండడమే తన లక్ష్యమని తెలిపారు. ప్రజలు డబుల్ బెడ్ రూం ఇండ్ల గురించి అడుగుతున్నారన్నారు. మొన్న విమానంలో ఓ ప్రయాణికుడి ప్రాణాలు కాపాడానని, ఎయిర్ హోస్టెస్ లకు సీపీఆర్ వంటి అత్యవసర వైద్య సేవల శిక్షణ ఇప్పించాలన్నారు

ముర్ము చాలా కింది స్థాయి నుంచి వచ్చిన మహిళ

రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన ద్రౌపది ముర్ముకు  తమిళిసై శుభాకాంక్షలు తెలియజేశారు. ‘ముర్ము చాలా కింది స్థాయి నుంచి వచ్చిన మహిళ.... చాలా సింపుల్ పర్సన్.. ఆమె రాష్ట్రపతి కావడం మహిళలకు దక్కిన గౌరవం’ అని ఆమె పేర్కొన్నారు.  ప్రజల్లోకి వెళ్లిన విషయాలను ప్రస్తావిస్తూ.. వర్షాలు వచ్చాయి కాబట్టి వరద ప్రాంతాల్లో తిరిగానని గవర్నర్ తమిళిసై అన్నారు. ‘‘నేను రాష్ట్రానికి ప్రథమ పౌరురాలిని కాబట్టే ప్రజల దగ్గరికి వెళ్లానని స్పష్టం చేశారు. వర్షాలకు ఎక్కువగా నష్టపోయిన ప్రాంతాలు ఆదివాసీలు ఉన్న ప్రాంతాలు కాబట్టి భద్రాచలం ఏరియాలో తిరిగాను.. నేను తెలుగు  ప్రజల కోసం పనిచేస్తున్న....వర్షాలపై రిపోర్టుని కేంద్రానికి ఇచ్చాను... వాళ్లు కేంద్ర బృందాలను పంపించారు.. కేంద్ర ప్రభుత్వం తప్పకుండా రాష్ట్రానికి సహాయం చేస్తుంది.. గతంలో వరదలు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం సహాయం చేసింది.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వర్షాల వల్ల ఎంత నష్టం జరిగిందో కేంద్రానికి ఇచ్చారు..’’ అని తమిళిసై పేర్కొన్నారు.